గ్లైఫోసెట్.. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర కలుపు నివారణ మందు. గజ్వేల్ డివిజన్ పరిధిలో జోరుగా ఈ మందు విక్రయాలు సాగుతున్నాయి. చాటుగా వంగడాలు కొనుగోలు చేసి.. బీటీ-3 పత్తిని సాగు చేసిన రైతులు ప్రస్తుతం కలుపు నివారణకు గ్లైఫోసెట్ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సిఫారసు లేఖ లేనిది.... ఆ మందును అమ్మకూడదు. కానీ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు గుట్టుగా సొమ్ము చేసుకుంటున్నారు. గతంలోనే గ్లైఫోసెట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎరువుల దుకాణాలపై నిఘా పెడుతున్నామని, అధికారుల అనుమతి లేకుండా అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏడీఎ అనిల్ తెలిపారు.
గజ్వేల్లో గుట్టుగా గ్లైఫోసెట్ అమ్మకాలు
సిద్ధిపేట జిల్లా గజ్వేల్లో కేంద్రప్రభుత్వం రద్దు చేసిన గ్లైఫోసెట్ ప్రమాదకర కలుపు నివారణ మందును అమ్ముతున్నారు. అనుమతి లేకుండా అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏడీఎ అనిల్ తెలిపారు.
గజ్వేల్లో గుట్టుగా గ్లైఫోసెట్ అమ్మకాలు