తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడాటిపల్లిలో హైటెన్షన్‌.. పరిహారం చెల్లించేంతవరకు పోరాటం ఆగదన్న భూనిర్వాసితులు - గుడాటిపల్లిలో హైటెన్షన్‌

గౌరవెళ్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. పరిహారం చెల్లించకుండా పనులు చేయనివ్వబోమని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భూనిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసం లేదన్నారు. మరోవైపు బాధితులకు విపక్ష నేతలు మద్దతు పలికారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు.

Gauravelli expatriate protest in husnabad
గుడాటిపల్లిలో హైటెన్షన్‌.. పరిహారం చెల్లించేంతవరకు పోరాటం ఆగదన్న భూనిర్వాసితులు

By

Published : Jun 15, 2022, 3:02 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గుడాటిపల్లిలో భూనిర్వాసితులు నిరసన తెలుపుతున్నారు. గౌరవెళ్లి ప్రాజెక్టులో భాగంగా అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు వెళ్లటంతో వారిని అడ్డుకున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే... ప్రాజెక్టులో 95 శాతం భూసేకరణ పూర్తయ్యిందని... అందిరికి దఫల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌ తెలిపారు. కొంతమందికి మాత్రమే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని.... వాటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు మేజర్లయిన వారికి ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారి సంఖ్య దాదాపు 500 ఉందని.. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

భూనిర్వాసితుల ఆందోళన:భూనిర్వాసితుల ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి. హుస్నాబాద్ లో ఆందోళనకు కాంగ్రెస్‌ నేతలు సంఘీభావం తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మద్దతు పలికారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ తరహాలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

భూనిర్వాసితులతో కలిసి మంత్రి హరీశ్‌ రావు ఇంటికి వెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. గౌరవెల్లి శివారులో వారిని పోలీసులు ‌అడ్డుకున్నారు. కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ భూ నిర్వహితులతో సీపీ చర్చలు జరిపారు. గౌరవెళ్లి నుంచి హుస్నాబాద్‌ మార్గాల్లో 2 చోట్ల పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details