సిద్దిపేటలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా శర్మ, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ హాజరయ్యారు.
'మట్టి వినాయకున్ని పూజించండి.. పర్యావరణం పరిరక్షించండి' - ganesh festival in siddipet
సిద్దిపేట పట్టణప్రజలకు మట్టి వినాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా శర్మ, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ హాజరయ్యారు.
ganesh-idols-distribution-in-siddipet
ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ మట్టి వినాయకులను పూజించాలని పద్మాకర్ తెలిపారు. ప్లాస్టిక్ వినాయకులు తీసుకువచ్చి పర్యావరణాన్ని పాడు చేయొద్దని... మట్టి వినాయకున్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. ఎవరి ఇళ్లలో వారు వినాయకున్ని పూజించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.