మున్సిపాలిటీ పరిధిలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి అధ్యక్షతన జరిగింది.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం - siddipet district
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రూ.25.53 కోట్లతో బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది.

గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదం
ఈ సమావేశంలో రూ.25.53 కోట్లతో బడ్జెట్‌కు కౌన్సిల్ ఆమోదించింది. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి బడ్జెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. అభివృద్ధిలో గజ్వేల్ ఆదర్శంగా నిలిచేలా కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కరోనాపై ప్రజలను చైతన్య పరచాలన్నారు.
ఇవీ చూడండి: 'పోతిరెడ్డిపాడు అంశంలో ఏపీ ప్రభుత్వ తీరుపై పోరు'