సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు వరించింది. 2019-20 సంవత్సరానికి గాను పురస్కారం లభించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ మహేశ్ తెలిపారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ నుంచి సమాచారం అందిందన్నారు. ద్వితీయ స్థానంలో ప్రోత్సాహక బహుమతికి ఆస్పత్రికి ఎంపిక అయిందన్నారు.
ఆస్పత్రిలో పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవలు, రికార్డులు నమోదు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.