సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్, గుండారెడ్డిపల్లి, పోరెడ్డిపల్లిలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. పోరెడ్డిపల్లిలోని మోయ తుమ్మెద వాగులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.
జల సవ్వడి: పొంగిపొర్లుతున్న మోయ తుమ్మెద వాగు - full of watetr flow in moya thummeda vaagu
గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల ప్రజలు వాగుల వద్దకు చేరుకొని నీటిలో ఆటలాడుతున్నారు.
పొంగిపొర్లుతున్న మోయ తుమ్మెద వాగు
వాగుపై ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్‌లపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు చెక్ డ్యాం వద్దకు చేరుకొని నీటితో ఆటలాడుకున్నారు. సెల్ఫీలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. పలువురు చేపలు పడుతూ... జీవనోపాధిని పొందుతున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు