తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజగృహపై దాడి అంటే.. ఎస్సీ,ఎస్టీ ఆత్మగౌరవంపైనే' - assault on ambedkar rajgruh

అంబేడ్కర్​ 'రాజగృహ'పై దాడి చేయడమంటే ఎస్సీ, ఎస్టీ ఆత్మగౌరవం మీద దాడి చేసినట్లేనని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసమవుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

manda krishna madiga about attack on ambedkar rajgruh
ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

By

Published : Jul 20, 2020, 10:48 PM IST

ముంబయిలోని అంబేడ్కర్​ రాజగృహపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ సిద్దిపేట అంబేడ్కర్ సర్కిల్​ వద్ద ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిరసనకు దిగారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్ రాజగృహపై దాడికి పాల్పడటమంటే ఎస్సీ,ఎస్టీ ఆత్మగౌరవం పై దాడి చేసినట్లేనని మందకృష్ణ అన్నారు.

దేశంలోని అన్ని అంబేడ్కర్ విగ్రహాలను, వాటి ఆనవాళ్లను రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తరచుగా అంబేడ్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజగృహపై దాడికి పాల్పడిని వారిని గుర్తించి శిక్షించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details