తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్నాబాద్​లో ఇందిరాగాంధీ వర్ధంతి - హుస్నాబాద్​

మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో​ కాంగ్రెస్​ నాయకులు నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యులు బొమ్మ శ్రీ రామ్, కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

former prime minister indira gandhi death anniversary at husnabad in siddipeta district
హుస్నాబాద్​లో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

By

Published : Oct 31, 2020, 4:12 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని అంబేడ్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యులు బొమ్మ శ్రీరామ్, కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశానికి ఎనలేని సేవలు చేశారని బొమ్మ శ్రీరామ్​ అన్నారు. బ్యాంకులను జాతీయం చేసి, రాజభరణాలు రద్దు చేశారన్నారు.

దేశంలో బడుగు బలహీనర్గాలకు ఇందిరమ్మ.. ఇళ్లు నిర్మించి ఇచ్చారని చెప్పారు. మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమను కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు.

ఇదీ చందవండి:ఆఫర్​ ఇచ్చి నెరవేర్చనందుకు కంట్రీక్లబ్​కు భారీ జరిమానా

ABOUT THE AUTHOR

...view details