రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని.. దానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
'కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది' - 'కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది'
రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని.. దానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
'కుటుంబ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది'
రాష్ట్రంలో రెండు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ఏడు సంవత్సరాల్లో కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసిందని విమర్శించారు. నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తెరాస అధికారంలోకి వచ్చి వాటిని తుంగలో తొక్కిందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.