సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తొలి నర్సు ఫ్లారెన్స్ నైటింగేల్ 200వ జన్మదినం సందర్భంగా నర్సులు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్రం 2020ని నర్సుల దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో గౌరవించాలని కోరుతూ నినాదాలు చేశారు.
ప్రపంచలోనే తొలి నర్సు 200వ జన్మదిన వేడుకలు - siddipet district news today
ప్రపంచలోనే తొలి నర్సు ఫ్లారెన్స్ నైటింగేల్ 200వ జన్మదినం సందర్భంగా హుస్నాబాద్‌లో నర్సులు కొవ్వత్తుల ర్యాలీ చేశారు. నర్సులను ఆఫీసర్లుగా పిలవాలనే చట్టం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచలోనే తొలి నర్సు 200వ జన్మదిన వేడుకలు
నైటింగేల్ మొహంలో చిరునవ్వు, చేతిలో లైటుతో అందించిన సేవలను కొనసాగిస్తున్నామని ప్రభుత్వ ఆస్పత్రి నర్సు జయకుమారీ అన్నారు. నర్సులను ఆఫీసర్లుగా పిలవాలనే చట్టం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. ఇకనైనా నర్సులను గౌరవించాలని, ఆమె ప్రజలకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కనకయ్య, నర్సులు శ్రీనివాస్, వినీత్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :తల్లి మృతదేహాన్ని ప్రయోగశాలకు ఇచ్చిన ఆదర్శ వైద్యుడు