తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లాడు.. విగతజీవిగా వచ్చాడు.. - died news

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూపాలపల్లిలో చోటుచేసుకుంది. ఉదయం వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నానికి కూడా రాలేదు. చెరువు వద్దకు వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు విగతజీవిగా దర్శనమివ్వగా... కన్నీటి పర్యంతమయ్యారు.

fisher man died in fond in siddipet district
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు చెరువులో మునిగి మృతి

By

Published : Jun 17, 2020, 7:27 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లికి చెందిన ఉసికే చంద్రం(45) గ్రామంలోని పెద్ద చెరువుకు ఉదయం చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం కావస్తున్నా ఇంటికి తిరిగి రాకపోవటం వల్ల కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూశారు. విగతజీవిగా పడి ఉన్న చంద్రాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

మత్స్య వృత్తి జీవనాధారంగా బతికే చంద్రం... కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. చంద్రానికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details