సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో జడ్పీ వైస్ ఛైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లను విడుదల చేశారు. మూడు లక్షల చేపపిల్లలకుగాను మొదటి విడుతలో భాగంగా తొంబై వేల చేప పిల్లలను చెరువులో వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మత్స్యకారుల అభివృద్ధి కోసం వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందిస్తుందని రాజారెడ్డి తెలిపారు.
'కులవృత్తులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం' - సిద్దిపేట జిల్లా తాజా వార్త
కులవృత్తులను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సిద్దిపేట జిల్లా జడ్పీవైస్ ఛైర్మన్ రాజారెడ్డి తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజితతో కలిసి 90వేల చేప పిల్లలను ఆయన విడుదల చేశారు.
మ్యానిఫెస్టోలోలేని ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, పశువులు, గొర్రెలు, చేపల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయాలను పెంపొందించి బంగారు తెలంగాణ సాధించే దిశగా కృషి చేస్తుందన్నారు. ఈసారి కురిసిన భారీ వర్షాలతో ఎల్లమ్మ చెరువు నిండడం చాలా సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతిరెడ్డి, మత్స్యశాఖ అధికారి వెంకయ్య, స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా