సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో కొండపోచమ్మ సాగర్ కాలువ నిర్మాణ పనులను ఆర్థిక మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రామాయంపేట, శంకరంపేట, ఉప్పరపల్లి చెరువులను కాలువల ద్వారా నింపుతామన్నారు. గౌరారం నుంచి రామాయంపేట వరకు 54 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే నిర్మాణ పనులను పూర్తి చేసి గోదావరి నీటిని తరలిస్తామన్నారు.
కాలువ నిర్మాణ పనులు పరిశీలించిన హరీశ్ రావు - finance minister harish rao latest news
ఆర్థిక మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో కొండపోచమ్మ సాగర్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామాయంపేట, శంకరంపేట, ఉప్పరపల్లి చెరువులను కాలువల ద్వారా నింపుతామన్నారు.
కాలువ నిర్మాణ పనులు పరిశీలించిన హరీశ్ రావు
దుబ్బాక నియోజకవర్గంలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కాలువల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.