సిద్దిపేట పాత బస్టాండ్ కూడలి వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు.
అక్షరాన్ని ఆయుధంగా మలిచిన వ్యక్తి అంబేడ్కర్: హరీశ్ రావు - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వార్తలు
అక్షరాన్ని ఆయుధంగా మలిచిన వ్యక్తి.. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వల్లే దేశం సుస్థిరంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ కూడలిలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పింది డాక్టర్ బీఆర్ అంబేడ్కరే అని గుర్తు చేశారు. ఆయన బాటలోనే పయనించి తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామన్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్లో ఎస్సీల అభ్యున్నతికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపు చేసుకున్నామని తెలిపారు. నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:బాబాసాహెబ్‌కు మోదీ, రాహుల్ నివాళి