సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. వీధివీధి తిరుగుతూ ప్రచారం కల్పించారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. పట్టణంలోని 700 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
'ఇంట్లోనే ఉందాం... కరోనాను తరిమికొడదాం' - ఆర్థిక మంత్రి హరీశ్ రావు
ఇంట్లోనే ఉంటూ.. కరోనాను తరిమికొడదామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో వాడవాడలా తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఇంట్లోనే ఉందాం కరోనాను ఖతం చేద్దాం: హరీశ్ రావు
గాంధీ రోడ్డు, భారత్‌నగర్‌లో రసాయనాలు పిచికారీ చేస్తున్న వాహనాన్ని పరిశీలించారు. ఒకరికొకరు దూరంగా ఉండాలని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లోనే ఉందాం కరోనాను ఖతం చేద్దామన్నారు.
ఇంట్లోనే ఉందాం కరోనాను ఖతం చేద్దాం: హరీశ్ రావు
ఇదీ చూడండి:-తల్లి పాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా?