అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తన వంతు విరాళం సమర్పించడం అదృష్టమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జిల్లా ప్రతినిధుల బృందం సిద్దిపేటలో సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తన వంతు సాయంగా రూ. 1,01,116 చెక్కును అందజేశారు.
అయోధ్య రాముడికి మంత్రి హరీశ్ విరాళం - తెలంగాణ వార్తలు
అయోధ్య రామమందిరం నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు తన వంతు సాయం అందించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్దిపేట జిల్లా ప్రతినిధుల బృందానికి రూ. 1,01,116 చెక్కును అందజేశారు.
అయోధ్య రాముడికి మంత్రి హరీశ్ విరాళం
ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ మెదక్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ రాఘవులు, ట్రస్టు ప్రతినిధులు హరినాథశర్మ, ప్రవీణ్‌కుమార్, బాలరాజేశం, సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, చిన్నకోడూరు ఎంపీపీ మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.