సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారక్పూర్, తిరుమలాపూర్, హైమద్నగర్ గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రచారం చేశారు. ప్రజాసంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్న తెరాసను గెలిపించాలని కోరారు. కారు గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్, భాజపాకు ఓటు వేస్తే అంతే: హరీశ్ రావు
దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా, కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రయోజనం శూన్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా దౌల్తాబాద్ మండలం ముబారక్పూర్, తిరుమలాపూర్, హైమద్నగర్ గ్రామాల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
వారికి ఓటు వేస్తే అంతే: హరీశ్ రావు
ఉప ఎన్నికలో భాజపా, కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రయోజనం శూన్యమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఇవ్వక రైతులను ఇబ్బందుల పాలు చేస్తే.. నేడు కేంద్రంలో ఉన్న భాజపా సర్కార్ మీటర్లు పెట్టి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అన్నదాతల సంక్షేమం కోసం పని చేస్తున్న తెరాస ప్రభుత్వం వైపే ప్రజలంతా ఉన్నారన్నారు.
ఇదీ చదవండి:కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత... రేవంత్ రెడ్డికి గాయం