సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో పల్లెప్రగతి కార్యక్రమంపై పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
పల్లెప్రగతిలో తేడా వస్తే మీదే బాధ్యత: హరీశ్ - finance minister harish rao in gajwel
గజ్వేల్లో పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్థికమంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. పల్లెప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
పల్లెప్రగతిలో తేడా వస్తే మీదే బాధ్యత: హరీశ్
ఎన్ని చట్టాలు చేసినా... క్షేత్రస్థాయిలో అమలు జరిగినప్పుడే ఫలితాలు వస్తాయని హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. పది రోజుల్లో హైదరాబాద్ నుంచి తనిఖీ బృందాలు రానున్నట్లు తెలిపారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా కొన్నిచోట్ల పర్యవేక్షించే అవకాశం ఉందన్నారు. ఏమైనా తేడాలు వస్తే సర్పంచి, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యతని హెచ్చరించారు.
ఇదీ చూడండి:పట్టణ ప్రగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష