తెలంగాణ

telangana

ETV Bharat / state

Vanteru: రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం మాదే - సీఎం కేసీఆర్​కు పాలాభిషేకం

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో రైతుబంధు నిధులు ఖాతాల్లో జమకావడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Fdc
కేసీఆర్

By

Published : Jun 15, 2021, 5:08 PM IST

రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. రైతుకు ఉచిత కరెంట్, రైతుబీమా, నాణ్యమైన విత్తనాలతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటోందని తెలిపారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో రైతుబంధు నిధులు ఖాతాల్లో జమకావడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్​డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వైపు చూస్తోందన్నారు.

ఇదీ చూడండి:Etela : హైదరాబాద్​ చేరుకున్న ఈటల బృందం

ABOUT THE AUTHOR

...view details