సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామ రైతులు ధర్నాకు దిగారు. మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్‌కు కాలువను తవ్వడాన్ని నిరసిస్తూ గత ఆరు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. రెండు పంటలు సాగయ్యే భూమిని తాము ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పంట పొలాలను బలవంతంగా తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరీష్ రావు వెంటనే స్పందించి కాలువ పనులను వేరే దిక్కు మళ్లించాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బలవంతంగా భూములు లాక్కుంటున్నారు - ANDOLANA
సిద్దిపేట జిల్లా రైతన్నలు ఆరు రోజులుగా ధర్నాకు దిగారు. మల్లన్న సాగర్ కాలువ కోసం తమ భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరు రోజులుగా రైతుల ధర్నా
TAGGED:
ANDOLANA