అనంతగిరి ప్రాజెక్టు నుంచి వచ్చే లింక్ కాలువల పనులను నిలిపివేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బెజ్జంకి, లక్ష్మీపూర్ గ్రామాల రైతులు నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ నెంబర్-10 కింద గత నెల రోజుల ముందు తమకు నోటీసులు ఇచ్చారన్నారు.
'సర్వే కూడా చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు' - లింక్ కాలువలు
లింక్ కాలువల నిర్మాణంలో తమకు అభ్యంతరాలున్నాయని బెజ్జంకి, లక్ష్మీపూర్ గ్రామాల రైతులు నిరసన తెలిపారు. కనీసం గ్రామసభ నిర్వహించకుండా, సర్వే చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారని వాపోయారు.
నోటీసును అనుసరించి ఆర్డీవో కార్యాలయానికి వస్తే గ్రామంలో ముంపు బాధితుల కింద పరిహారం ఇచ్చేందుకు పిలిచారని తెలిపారు. కనీసం గ్రామసభ నిర్వహించకుండా, సర్వే చేయకుండా పిలవడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. సుమారు 63 ఎకరాల భూమిని అలైన్మెంట్ చేశారని ఆర్డీవోను అడిగితే... ఇదే గ్రామసభ అనుకుని అభ్యంతరాలు చెప్పమని నిర్లక్ష్యంగా బదులిస్తున్నారని వాపోయారు. కాలువల నిర్మాణంలో తమకు అభ్యంతరాలున్నాయని... వాటి నిర్మాణాన్ని రద్దు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:దేశానికే ఆదర్శంగా సిద్దిపేట మున్సిపాలిటీ: హరీశ్ రావు