సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పక్కనే ఉన్న రహదారిపై బైఠాయించి సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించడం వల్ల భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఐకేపీ కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి 15, 20 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, అధికారులు ఇటువైపు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవెల్లి ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన - రైతుల ఆందోళన
సిద్దిపేట జిల్లా గౌరవెల్లిలో రైతుల ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
![గౌరవెల్లి ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన Farmers protest, Gauravelli IKP Center, siddipet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:21:56:1620723116-tg-krn-101-11-rythula-andholana-av-ts10085-11052021141510-1105f-1620722710-694.jpg)
Farmers protest, Gauravelli IKP Center, siddipet
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అధికారులు.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.