తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల నిరహార దీక్ష... దిగివచ్చిన ఆర్డీఓ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆరపల్లిలో ధాన్యం కోనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన దీక్ష చేశారు. గత నెల 17న కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆందోళన వద్దు.. మొత్తం ధాన్యం కొంటాం : ఆర్డీఓ
ఆందోళన వద్దు.. మొత్తం ధాన్యం కొంటాం : ఆర్డీఓ

By

Published : May 4, 2020, 4:08 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ఆరపల్లిలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. వ్యవసాయ అధికారులు ఇచ్చిన టోకెన్లు తీసుకొని 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చామని రైతులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2 సార్లు వర్షం పడిందని రైతులు అన్నారు. నాన తంటాలు పడి ధాన్యాన్ని ఆరబెట్టి తిరిగి కేంద్రానికి తరలిస్తే కొనుగోలు చేయట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరబెట్టిన ధాన్యం చెదలు పడుతుందని, టార్ఫాలిన్ కవర్ల కింద కీటకాలు ఉంటున్నాయని అవి కరిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు వాపోయారు.

'ఆందోళన వద్దు.. మొత్తం ధాన్యం కొంటాం'

దీనిపై అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పట్లేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల దీక్ష గురించి సమాచారం అందుకున్న ఆర్డీఓ జయచంద్రారెడ్డి కొనుగోలు కేంద్రానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఈసారి ధాన్యం దిగుబడి అంచనాకు మించి అధికంగా వచ్చిందని... కొనుగోలు విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జాప్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి : వలస కార్మికుల రైల్​ టికెట్​పై రాజకీయ రగడ

ABOUT THE AUTHOR

...view details