సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌లతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తెరాస ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో బోనస్‌తో కలిపి క్వింటాల్ ధాన్యానికి రూ. 2500 ఇస్తుంటే.. రాష్ట్రంలో రూ.1835 ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. తాలు పేరిట మిల్లర్లు కోత విధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.