తెలంగాణ

telangana

ETV Bharat / state

కనీస సౌకర్యాలు లేక... వేడుకుంటున్న రైతులు - వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

యాసంగిలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ అక్కడ సరైన సౌకర్యాలు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంటను ఆరబెట్టడానికి, సంచుల్లో పోయడానికి కనీస సౌకర్యాలు లేవని వాపోతున్నారు.

Farmers begging for little or no facilities at crop sale centres
కనీస సౌకర్యాలు లేక... వేడుకుంటున్న రైతులు

By

Published : Apr 17, 2020, 5:28 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో లాక్​డౌన్ కారణంగా 23 మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే.. వారం రోజులు గడుస్తున్నా వరి ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్ కవర్లు లేక చీరల్లో అరబోస్తున్నామని రైతులు చెబుతున్నారు.

తాలూ ధాన్యాన్ని వేరు చేసే యంత్రాలు, తేమశాతం చూసే మిషన్లు లేవని, కొనుగోలు చేసేవారు రావడం లేదని అంటున్నారు. ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు తాగునీరు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఒకవేళ అకాల వర్షం పడితే ఇన్ని రోజులు ఆరబెట్టిన ధాన్యం, కష్టం నీళ్ల పాలు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ఆ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

కనీస సౌకర్యాలు లేక... వేడుకుంటున్న రైతులు

ఇదీ చూడండి :శ్రీమంతానికి వెళ్తుండగా ప్రమాదం.. గర్భిణీ మృతి

ABOUT THE AUTHOR

...view details