తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య - ఆత్మహత్య

వేసిన పంట అనుకున్నంత లాభం ఇవ్వక… చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

farmer suicide due to debts in siddipet district
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

By

Published : Jul 22, 2020, 1:59 PM IST

అన్నదాత సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... వారి ఆత్మహత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ధర్మారం మల్లయ్య అనే రైతు అప్పుల బాధ తాళలేక వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటికి పెద్దదిక్కు మృతి చెందడం వల్ల ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:అసలేం జరిగింది.. అడవిలో చెట్టుకు వేలాడుతూ మహిళ మృతదేహం

ABOUT THE AUTHOR

...view details