తెలంగాణ

telangana

ETV Bharat / state

తమ భూసమస్యను పరిష్కరించాలని యువరైతు ఆందోళన - siddipet district news

తమ భూసమస్యను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ యువరైతు ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి ఎక్కి ఆందోళన చేపట్టాడు. తహసీల్దార్​, వీఆర్వోలు పట్టా పుస్తకాల కోసం లంచం అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల జోక్యం చేసుకుని పట్టా పుస్తకాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు.

farmer is anxious to solve their land problem in siddipet district
తమ భూసమస్యను పరిష్కరించాలని యువరైతు ఆందోళన

By

Published : Aug 14, 2020, 6:33 PM IST

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తమ భూసమస్యను పరిష్కరించాలని, పట్టా పుస్తకాలు ఇవ్వాలని ఓ యువరైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం తోర్నాల గ్రామానికి చెందిన యువరైతు సామ్రాట్... తహసీల్దార్​, వీఆర్వోలు తమ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని, లంచం అడుగుతున్నారని సిద్దిపేట కలెక్టరేట్​ సమీపంలోని ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి ఎక్కాడు. వెంటనే తమ భూసమస్యను పరిష్కరించాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేపట్టాడు.

ఎమ్మార్వో, వీఆర్వో లంచం అడుగుతున్న ఫోన్​ సంభాషణను బయటపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని సామ్రాట్​తో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి తమ పట్టా పాసు పుస్తకాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం వల్ల సామ్రాట్​ కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఇవీ చూడండి: 'స్వచ్ఛందంగా ప్లాస్మాదానం చేయండి... బాధితుల ప్రాణం కాపాడండి'

ABOUT THE AUTHOR

...view details