ధాన్యాన్ని ఆరబెట్టడానికి సరిపడా కూలీలు లేకపోవడం వల్ల ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. నాగలితో సులభంగా ధాన్యాన్ని ఆరబెడుతూ పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోతుకులపల్లిలో జరిగింది.
మోతుకులపల్లికి చెందిన భూక్య తిరుపతి తన వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రతిరోజు ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. సరిపడా కూలీలు లేకపోవడం వల్ల నాగలి సాయంతో వడ్లను ఆరబోస్తున్నాడు. గ్రామంలో ఉపాధి హామీ పనులు నడుస్తుండటం వల్ల కూలీల కొరత ఏర్పడింది. అందువల్ల ఇలా కొత్త ఉపాయం ఆలోచించానని రైతు చెబుతున్నాడు.