ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదగిరి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలోని మోటార్‌కు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడగా... మరమ్మతుల కోసం విద్యుత్ నియంత్రిక వద్దకు వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేసే క్రమంలో షాక్ తగిలి యాదగిరి అక్కడికక్కడే మృతి చెందారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - Farmer dies of electric shock
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రైతు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లిలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
గమనించిన స్థానిక రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా... విగతజీవిగా ఉన్న యాదగిరి మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.