సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెంది రైతు మట్ట బుచ్చిరెడ్డి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బుచ్చిరెడ్డి రోజు మాదిరి తన పొలం పనులు చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసి అతనిపై పిడుగుపడింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చూసి అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పిడుగుపాటుకు రైతు మృతి - పిడుగుపాటుకు రైతు మృతి
అన్నదాతను పిడుగురూపంలో మృత్యువు కబళించింది. పొలంలో పనిచేసుకుంటుండగా పిడుగుపడి ఓ రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో జరిగింది.
![పిడుగుపాటుకు రైతు మృతి పిడుగుపాటుకు రైతు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6857455-637-6857455-1587305359543.jpg)
పిడుగుపాటుకు రైతు మృతి