తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - latest crime news in siddipet district

అప్పుల బాధలు తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Farmer commits suicide due to debt
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

By

Published : Feb 16, 2020, 11:46 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక వేముగంటి దాసు (48) అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దాసు అప్పులు చేసి తనకున్న రెండెకరాల పొలంలో వరి పంట వేశాడు. పంట చేతికొస్తే తన అప్పులు తీర్చుకోవచ్చులే అనుకున్నాడు. కానీ అతని ఆశలకు గండి కొడుతూ.. మోటార్​ కాలిపోయింది. ఫలితంగా కళ్లముందే పొలం ఎండిపోతోంది. మోటారు బాగు చేయించడానికీ డబ్బులు లేకపోవడం వల్ల చేసేదేమీలేక పొలం, జీవితం రెండింటిపై ఆశలు వదిలేసుకున్నాడు. ఆత్మహత్యే శరణ్యమని భావించాడు.

ఇవాళ ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇదీ చూడండి:'సహకార' ఎన్నికలు ప్రశాంతం.. ఫలితాల విడుదల

ABOUT THE AUTHOR

...view details