Farmer suicide attempt: తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం - Farmer suicide attempt
16:49 December 21
Farmer suicide attempt: తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
Farmer suicide attempt: సిద్దిపేట జిల్లా నంగునూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. బద్దిపడగ గ్రామానికి చెందిన అంజయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తనకు రావలసిన భూమి కోర్టు పరిధిలో ఉండగా.. తహసీల్దార్ భూపతి మరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని అంజయ్య ఆరోపించాడు. తన భూమిని అక్రమంగా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారన్న మనస్తాపంతో.. ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న స్థానికులు అంజయ్యను అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలికి చేరుకుని అంజయ్యను ఠాణాకు తరలించారు.
ఇదీ చూడండి: