సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన తిరుపతి అనే రైతు... మంత్రి హరీశ్‌రావుపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా తెలిపాడు. తన పొలంలో తన్నీరు హరీశ్ రావు అని వరినారుతో ఒక మడిని తయారు చేయించాడు.
నారుమడిలో మంత్రి హరీశ్.. తిరుపతి అభిమానానికి జనం ఫిదా!
హరీశ్‌రావు అంటే ఎంతోమందికి చెప్పలేనంత అభిమానం. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఆయన్ని అభిమానించేవారుంటారు. అయితే.. తిరుపతి మాత్రం తన అభిమానాన్ని వినూత్నంగా చాటాడు. మంత్రి దయతోనే తన పొలం పచ్చబడిందని.. ఓ మడిలో హరీశ్ పేరును నారుతో రాసుకున్నాడు.
నారుమడితో మంత్రిపై అభిమానాన్ని చాటుకున్న వ్యక్తి
సాగునీరు అందించేందుకు, ప్రాజెక్టులు నిర్మించేందుకు మంత్రి హరీష్ రావు ఎంతో కష్టపడ్డారని తిరుపతి తెలిపాడు. రంగనాయకసాగర్ ద్వారా తమ గ్రామాలకు గోదావరి జలాలు వచ్చి చెరువులు, కుంటలు నిండాయని చెప్పాడు. ప్రస్తుతం ఆ నీటితోనే వ్యవసాయం చేస్తున్నానని తిరుపతి సంతోషం వ్యక్తం చేశాడు.