తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. ఇద్దరు అరెస్టు - నకిలీ విత్తనాలు

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​లోని ఓ ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలను అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాలు కలిగి ఉన్నా, అమ్మినా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

fake cotton seeds caught in siddipet district
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. ఇద్దరు అరెస్టు

By

Published : Jun 21, 2020, 7:07 PM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రంలోని తుమ్మల మహేందర్, మైల్ రాజు అనే ఇద్దరు వ్యక్తులు కలిసి నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ చంద్రశేఖర్, విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్​ సీఐ బాల్ రెడ్డి, దౌల్తాబాద్ వ్యవసాయ అధికారి గోవిందరాజు, పోలీస్ సిబ్బందితో కలిసి మహేందర్ ఇంట్లో సోదాలు చేసి 55 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు కలిగి ఉన్నా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. గ్రామాల్లో విడి పత్తి విత్తనాలు ఎవరైనా అమ్మడానికి వస్తే వెంటనే డయల్ 100కు ఫోన్​ చేసి సమాచారం అందించాలని సూచించారు. రైతులను మోసం చేసేవారు ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు.

ఇవీ చూడండి: నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details