తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు న్యాయం చేయలేని వాడు నాయకుడిగా ఫెయిల్' - minister harish rao latest news

అన్నంపెట్టే అన్నదాతకు సేవ చేస్తే.. దేశానికి సేవ చేసినట్లేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని వాడు నాయకుడిగా ఫెయిల్ అయినట్లేనని మంత్రి పేర్కొన్నారు.

siddipet district latest news
siddipet district latest news

By

Published : May 23, 2020, 3:18 PM IST

సిద్దిపేట జిల్లా ఉద్యమం,అభివృద్ధిలో మెుదటి స్థానంలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. అలాగే వ్యవసాయ సంస్కరణల్లో కూడా ఫస్ట్ ఉండాలని మంత్రి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వానాకాలం నియంత్రిత పంటల సాగుపై సిద్దిపేట జిల్లాలోని భైరి అంజయ్య గార్డెన్​లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలకు హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. వర్షాకాల పంటల సాగు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

రైతులను సంఘటిత శక్తిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనని మంత్రి తెలిపారు.కానీ రైతు మాత్రం ఎవరో.. నిర్ణయించిన ధరకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 7 వేల రూపాయల కోట్లను రైతుబంధు కోసం బడ్జెట్​లో పెట్టామని... రైతులందరికీ అందిస్తామని పేర్కొన్నారు.

మొక్కజొన్న పంట వానా కాలంలో పండిస్తే..దిగుబడి తక్కువ వస్తోందన్నారు. యాసంగిలో మక్క... వానా కాలంలో పత్తి, వరి, పెసర, కందులు వంటి పంటలు వేయాలని సూచించారు. కంది పంటలో కొత్త వంగడాలు వచ్చాయి.. ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆ తర్వాత రెండవ పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చని తెలిపారు.

తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లు, రైతుబంధు సాయంకు కొరత లేదని హరీశ్​ రావు స్పష్టం చేశారు.గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తే.. ఎకరాకు 15 క్వింటాళ్ల పంట వస్తదని పేర్కొన్నారు. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా మాస్కుల తయారీ భారీగా పెరిగిందన్నారు. పత్తికి డిమాండు ఎక్కువగా ఉన్న దరిమిలా... పత్తి పంట వేస్తే అధిక లాభమని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, హుస్నాబాద్, దుబ్బాక ఎమ్మెల్యేలు సతీశ్, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, రఘోత్తం రెడ్డి, ఏఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details