హుస్నాబాద్ ప్రాంతంలో ఆలయాల అభివృద్ధి జరగలేదని, దేవాలయాల వద్ద కనీస సౌకర్యాలు లేక భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని ప్రసిద్ధ స్వయంభూ రాజేశ్వరస్వామి వారికి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొమ్మ శ్రీరాం పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పొట్లపల్లి రాజేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు - పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తాజా వార్తలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని రాజేశ్వరస్వామి వారిని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ బొమ్మ శ్రీరాం దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![పొట్లపల్లి రాజేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు executive president of PCC Ponnam Prabhakar presented garments to Potlapally Rajeshwara swamy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10963661-776-10963661-1615455325988.jpg)
పొట్లపల్లి రాజేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు
ఆలయ అధికారులు పొన్నం ప్రభాకర్‌కు ఘనస్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: పొట్లపల్లి రాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు