సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి దుబ్బాక మాజీ జడ్పీటీసీ ఎల్పుల గౌతమి మహేష్ ఆధ్వర్యంలో 25 ఎన్-95 మాస్కులను, 25 ఫేస్ షీల్డులను ఎస్సై మన్నే స్వామి పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోందని ఎస్సై అన్నారు.
పోలీసులకు మాస్కులు, ఫేస్‌షీల్డులు అందజేసిన మాజీ జడ్పీటీసీ - సిద్దిపేట జిల్లా వార్తలు
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దుబ్బాక పోలీస్ సిబ్బందికి మాజీ జడ్పీటీసీ ఎల్పుల గౌతమీ మహేష్ 25 ఎన్-95 మాస్కులను, 25 ఫేస్ షీల్డులను అందజేశారు. వాటిని ఎస్సై మన్నే స్వామి సిబ్బందికి పంపిణీ చేశారు.

పోలీసులకు మాస్కులు, ఫేస్షీల్టులు అందజేసిన మాజీ జడ్పీటీసీ
కరోనా వ్యాధి నివారణ కోసం పోరాడుతున్న పోలీస్ సిబ్బందికి మాజీ జడ్పీటీసీ మాస్కులను, ఫేస్‌షీల్డులను అందజేశారన్నారు. మాస్కులు అందించిన మాజీ జడ్పీటీసీ ఎల్పుల గౌతమీ మహేష్‌కు ఎస్సై మన్నే స్వామి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో సీఎం కేసీఆర్ సమీక్ష