మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను జిల్లా కేంద్రంలో కోమటి చెరువులో ఆయన విడిచిపెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు సరిగా కురవకపోవడం వల్ల చెరువులు నిండలేదని.. దసరా నాటికి కాళేశ్వరం జలాలతో అన్ని చెరువులను నింపుతామన్నారు. మత్స్యశాఖ అధికారులు చేపపిల్లలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. మత్య్సకారులు కూడా సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి: హరీశ్‌రావు - హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చేపపిల్లలను విడిచిపెట్టారు. ప్రస్తుతం కొన్ని చెరువులే నీటితో నిండుకున్నా.. దసరా నాటికి అన్ని చెరువులను కాళేశ్వరం జలాలతో నింపుతామని హామీనిచ్చారు. మత్స్యకారులు దళారీలను ఆశ్రయించకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవాలని సూచించారు.
![మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి: హరీశ్‌రావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4239290-6-4239290-1566730710596.jpg)
మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి: హరీశ్‌రావు