సిద్దిపేట జిల్లా వెల్గటూర్, ముండ్రాయి గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లను మాజీ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. కేసీఆర్ ముందుచూపు వల్ల ఈరోజు ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కనిపిస్తోందన్నారు. అన్ని వసతులతో ఇళ్లను నిర్మించామని, శుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంటి ముందు మొక్కలు నాటి వాటిని కాపాడాలని తెలిపారు. ఈ ఇళ్లను ఎవరైనా అమ్మినా.. కొన్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
డబుల్ బెడ్రూం అమ్మినా... కొన్నా.. జైలుకే! - మాజీ మంత్రి హరీశ్ రావు
నిలువ నీడ లేని వారికే కాదు, ఇంటి స్థలం ఉన్నవారికి కూడా త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ఇళ్లను ఎవరైనా... అమ్మినా, కొన్నా జైలుకి వెళ్తారని హెచ్చరించారు.
డబుల్ బెడ్రూం అమ్మినా... కొన్నా.. జైలుకే!