తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తెరాసకు గుణపాఠం చెప్పండి' - సిద్దిపేట జిల్లా వార్తలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో భాగంగా మాజీ మంత్రి గీతారెడ్డి... కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​కు ఓటు వేయాలని ఆమె కోరారు.

'కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తెరాసకు గుణపాఠం చెప్పండి'
'కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి తెరాసకు గుణపాఠం చెప్పండి'

By

Published : Oct 8, 2020, 10:10 PM IST

డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించి పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి గీతా రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా గజ్వేల్ మండలం ఆరేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గీతారెడ్డి అన్నారు. 108, 104 అంబులెన్స్ సేవలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందిందన్నారు. తెరాస ప్రజలను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి తెరాసకు గుణపాఠం చెప్పాలన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ:ఇంద్రకరణ్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details