సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భారతి హొళికెరి కోరారు. ఈనెల 3న దుబ్బాక ఎన్నికల పోలింగ్ ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు సాగుతుందని చెప్పారు. ఓటు హక్కును.. హక్కుగా మాత్రమే చూడకుండా బాధ్యతగా భావించాలన్నారు.
దుబ్బాక నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు చేస్తున్న ఏర్పాట్లను వెల్లడించారు. ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను జాగృతం చేసేందుకు స్వీప్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ద్వారా పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తూ.. ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నామని తెలిపారు.