హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మీదుగా కమలాపూర్ వెళ్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender)కు హుస్నాబాద్‌లో భాజపా నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, భాజపా నేత వివేక్ వాహనాలకు ముందు కాషాయ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈటల, వివేక్, రఘునందన్ రావులను ఘనంగా శాలువాతో సన్మానించారు.
Etela Rajender : ఈటలకు హుస్నాబాద్ భాజపా శ్రేణుల ఘనస్వాగతం - ఈటల రాజేందర్ కమలాపూర్ పర్యటన
భాజపాలో చేరిన తర్వాత తొలిసారిగా ఈటల రాజేందర్(Etela Rajender) కమలాపూర్‌కు వెళ్తున్నారు. మార్గమధ్యలో హుస్నాబాద్ వద్ద భాజపా శ్రేణులు ఈటలకు ఘనస్వాగతం పలికాయి. బైక్ ర్యాలీతో ఆయణ్ను.. పట్టణం దాటించాయి.
![Etela Rajender : ఈటలకు హుస్నాబాద్ భాజపా శ్రేణుల ఘనస్వాగతం etela, etela rajender, etela visited kamalapur, etela visit to husnabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12163427-thumbnail-3x2-aa.jpg)
ఈటల, హుస్నాబాద్‌లో ఈటల, ఈటలకు భాజపా శ్రేణుల స్వాగతం
అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి ఈటల రాజేందర్(Etela Rajender) పూలమాల వేసి నివాళులర్పించారు. జై ఈటల అంటూ భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఈటల కమలాపూర్‌కు బయలుదేరారు. ఈటల (Etela Rajender) భాజపాలో చేరడం వల్ల హుస్నాబాద్ కాషాయ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.