తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Rajender Election Campaign in Gajwel : 'నన్ను హేళన చేసినందుకే గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీకి దిగాను' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Etela Rajender Election Campaign in Gajwel : పార్టీ కోసం పని చేసిన తనని మెడ పట్టి బయటకు గెంటారని ఈటల రాజేందర్ విమర్శించారు. తన నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. కేసీఆర్ మొఖం మీద తాను గెలవలేదని.. తన మొఖాన్ని చూసి ప్రజలు గెలిపించారని ఆరోపించారు. ప్రచార సమయంలో తాను ఏ ఊళ్లో నిద్రపోతే అక్కడ కరెంటు పోయేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చిన్న పోరగాళ్లు మద్యానికి బానిసవుతున్నారని విరుచుకుపడ్డారు.

Etela Rajender Election Campaign in Gajwel
Etela Rajender

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 7:03 PM IST

Etela Rajender Election Campaign in Gajwel :గజ్వేల్‌లో బీజేపీ శంఖారావాన్ని ఆ పార్టీ నేత, అభ్యర్థిఈటల రాజేందర్(Etela Rajender) పూరించారు. ఈ నియోజకవర్గానికి తాను కొత్త కాదని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఈటల గజ్వేల్‌లో పర్యటించారు. అనంతరం ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఈటల రాజేందర్, రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కూడా పోటీ చేయడానికి అధిష్ఠానం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. గజ్వేల్‌లో తొలి పౌల్ట్రీఫాం ఏర్పాటు చేసి తన జీవితం ప్రారంభించానని ఈటల తెలిపారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో ఇక్కడే ఎక్కువగా తిరిగేవాడిని చెప్పారు.

Etela Rajender Fires On KCR In Gajwel : తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసని ఈటల పేర్కొన్నారు. ఎమ్మెల్యేను అయ్యాక తెలంగాణతో పాటు అణగారినవర్గాల వారి కోసం కూడా పోరాడానని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మున్సిపల్‌ కార్మికులు తొలిసారి ఆందోళనలు చేశారన్నారు. ఒక్క సంతకంతో మున్సిపల్‌ కార్మికులను సీఎం కేసీఆర్‌ తొలగించారని ఈటల ధ్వజమెత్తారు. ఉద్యమాలు, పోరాటాలకు పేరొందిన తెలంగాణలో అవి కనపడకుండా చేయాలని చూశారని మండిపడ్డారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను అవమానించారని ఆరోపించారు.

Etela Rajender Speech at Jammikunta Meeting : 'బీఆర్‌ఎస్‌ విశ్వాసం కోల్పోయింది.. బీజేపీ అధికారంలోకి వస్తే 6 నెలలకో జాబ్‌ క్యాలెండర్'

కేసీఆర్ మొఖం మీద నేను గెలవలేదు :ఆనాడు తెలంగాణ వచ్చే వరకు బస్సు కదలదని నిరసన చేశామని.. కానీ, ఆర్టీసీ ఉద్యోగులను పటించుకోలేదని ఈటల అన్నారు. ఇప్పుడు ఓట్లకోసం ఆర్టీసీ కార్మకులను ప్రభుత్వ ఉద్వోగుల్లా గుర్తించారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా గెలవాలని ఇక్కడకి రాలేదని.. హుజురాబాద్‌లో తన గెలుపు ఆపలేరని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ మొఖం మీద తాను గెలవలేదన్న ఆయన.. తన మొఖాన్ని చూసి ప్రజలు గెలిపించారని ఈటల వివరించారు.

Etela Rajender Sansational Comments on CM KCR :5,800 మంది దళితుల భూములను కేసీఆర్ దోచుకున్నరన్న ఈటల.. ఆయనను హేళన చేసినందుకే గజ్వేల్‌కి వచ్చి కేసీఆర్‌పై పోటీకి దిగానని స్పష్టం చేశారు. గజ్వేల్‌కి ఏమిస్తానో తెలియదు కానీ, ఇక్కడ పార్టీ క్యాడర్ పెరిగిందన్నారు. తాను కేసీఆర్‌తో డబ్బులు కోసం కొట్లాడను.. ఆత్మవిశ్వాసంతో కొట్లాడతాను.. గజ్వేల్ ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే పండిన ప్రతి గింజ కొంటామని.. నిరుద్యోగ యువతకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటులో కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఏ వ్యక్తి చనిపోయిన ఐదు లక్షల బీమా ఇస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.

'గజ్వేల్‌కు నేను కొత్త కాదు. గజ్వేల్‌లో తొలి పౌల్ట్రీఫాం ఏర్పాటు చేసి నా జీవితం ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో గజ్వేల్‌లోనే ఎక్కువగా తిరిగేవాడిని. సొంత ప్రాంతంలో తిరగాలని కేసీఆర్ చెప్తే.. హుజురాబాద్‌లో ఉద్యమం నడిపాను. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో ప్రజలందరికి తెలుసు. ఎమ్మెల్యేను అయ్యాక తెలంగాణతో పాటు అణగారిన వర్గాల వారి కోసం కూడా పోరాడాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత మున్సిపల్‌ కార్మికులు తొలిసారి ఆందోళనలు చేశారు. ఒక్క సంతకంతో మున్సిపల్‌ కార్మికులను సీఎం కేసీఆర్‌ తొలగించారు.' -ఈటల రాజేందర్, బీజేపీ నేత

Raghunandan Rao on Telangana Government : అలాగే కేసీఆర్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. తెలంగాణ సమాజం ఆకలినైనా భరిస్తుంది కానీ.. ఆత్మాభిమానం చంపుకోదని చెప్పారు. ఎన్నికల ముందు పైసలు పంచి ఓట్లు వేయించుకునేందుకు పైసల మంత్రి వస్తారని ఆరోపించారు. తెలంగాణలో మద్యం ద్వారా రూ.50 వేల కోట్ల ఆదాయం వస్తోందన్న ఆయన.. మద్యం ద్వారా ప్రజల డబ్బు, ఆరోగ్యం దోచుకుని పింఛన్లుగా ఇస్తున్నారని విమర్శించారు. మద్యం ఆదాయం పెరిగింది కాబట్టే.. పింఛన్లను కూడా పెంచారని రాష్ట్ర ప్రభుత్వం రఘునందన్‌రావు విరుచుకుపడ్డారు.

Etela Rajender Election Campaign in Gajwel నన్ను హేళన చేసినందుకే గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీకి దిగాను

Etela Clarity on Competition from Gajwel : గజ్వేల్ నుంచి పోటీపై ఈటల రాజేందర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే..?

Telangana BJP MLA Candidates Second List : కొలిక్కివస్తోన్న అభ్యర్థుల ఎంపిక.. నవంబర్​ 1 లేదా 2న రెండో జాబితా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details