సిద్దిపేట జిల్లా కోహెడలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లు, ఆటోడ్రైవర్లకు సింగిల్ విండో ఛైర్మన్ దేవేందర్ రావు దంపతులు, సర్పంచ్ పెర్యాల నవ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పని గొప్పదన్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కరోనా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తమ వంతుగా సేవ చేస్తున్నారని తెలిపారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఛైర్మన్, సర్పంచ్ - సిద్దిపేట జిల్లా కోహెడ ఈరోజు వార్తలు
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పలువురు దాతలు నిరుపేదలకు సహాయం చేస్తూ తమ ఔదార్యాన్ని చాటుతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో సింగిల్ విండో ఛైర్మన్ దేవేందర్ రావు దంపతులు, సర్పంచ్ పెర్యాల నవ్య కార్మికులకు నిత్యావసరాలు వితరణ చేశారు.
![నిత్యావసరాలు పంపిణీ చేసిన ఛైర్మన్, సర్పంచ్ essentials supplied the Chairman, Sarpanch at koheda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6866549-283-6866549-1587372755562.jpg)
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఛైర్మన్, సర్పంచ్
వారికి సాయంగా తమ వంతు నిత్యావసరాలు అందజేస్తున్నట్లు ఆ దంపతులు తెలిపారు. మే 7 వరకు లాక్డౌన్ పొడిగించినందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారిని పారదోలాలని కోరారు.
ఇదీ చూడండి :ఏపీలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు