సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకున్నారు. అయితే ఈ సారి కరోనా వైరస్ ప్రభావం, మరోవైపు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధికమాసం కావడం వల్ల ఆడపడుచులు అక్కడక్కడా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చారు.
నిరాడంబరంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు - నిరాడంబరంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
పితృఅమావాస్య కావడం వల్ల మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. తోగుట మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వైరస్ నేపథ్యంలో ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.
నిరాడంబరంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక
అధికమాసం దృష్టా గ్రామాల్లో ఈ ఏడాది మొదటి రోజు బతుకమ్మ పండుగ వాతావరణం ఎక్కడ కనిపించలేదు. పెద్దల అమావాస్య రోజే అధికమాసం కావడం వల్ల ఈరోజు ఒక్కరోజే బతుకమ్మ చేయాలని, తిరిగి అక్టోబరు వచ్చే అమావాస్య రోజు నుంచి పండుగ తిరిగి ప్రారంభమవుతుందని పురోహితులు తెలిపారు.
ఇదీ చూడండి:ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు... తీరొక్క పూలు పేర్చి ఆట పాటలు