సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పురపాలక సంఘం ఛైర్మన్ సుద్దాల చంద్రయ్య అమ్మవారికి పట్టువస్తాలను సమర్పించారు. ఏటా వైశాఖ పౌర్ణమి నుంచి జ్యేష్ఠ పౌర్ణమి వరకు నెలరోజులపాటు వైభవోపేతంగా ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రతి మంగళ ,శుక్ర ,ఆదివారాల్లో జరిగే ప్రత్యేక పూజలకు భక్తులు ఎక్కువగా హాజరవుతారు. అమ్మవారికి బోనాల సమర్పించడం, పట్నాలు వేయడం, చీరలు పెట్టి ఒడిబియ్యం పోయడం, గండ దీపాలు వెలిగించడం, కుంకుమార్చనలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆచారంగా వస్తోంది.
వైభవంగా ఎల్లమ్మ జాతర ప్రారంభం - husnabad
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభయ్యాయి. పురపాలక సంఘం ఛైర్మన్ సుద్దాల చంద్రయ్య అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఎల్లమ్మ జాతర ప్రారంభం