సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి రాఘవశర్మ పరిశీలించారు. నామపత్రాల దాఖలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ ప్రక్రియ ముగుస్తున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దుబ్బాక ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారి
దుబ్బాక ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి రాఘవ శర్మ పరిశీలించారు. పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ప్రక్రియను నిర్వహించడానికి అధికారులు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు.
రిటర్నింగ్ అధికారి రాఘవ శర్మ
శాంతి భద్రతల సమస్య, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఎంసీఎంసీ సెంటర్లను రాఘవశర్మ పరిశీలించారు. వెబ్‌కాస్టింగ్, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వంటి అంశాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించారు. సీసీ కెమెరాలు, విద్యుత్ వినియోగంపై సూచనలు చేశారు.