సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా గ్రామాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న తెరాస ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
'దుబ్బాక ఎన్నికల్లో సుజాతకు ఓటేసి తెరాసను గెలిపించండి' - trs canvassing for dubbaka elctions
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలకేంద్రంలో తెరాస అభ్యర్థి సుజాతకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే సోలిపేట సుజాతకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని ప్రజలను కోరారు.
!['దుబ్బాక ఎన్నికల్లో సుజాతకు ఓటేసి తెరాసను గెలిపించండి' election campaigning for dubbaka elections for trs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9343034-135-9343034-1603885327980.jpg)
'దుబ్బాక ఎన్నికల్లో సుజాతకు ఓటేసి తెరాసను గెలిపించండి'
తెరాస అభ్యర్థి సుజాతకు మద్దతుగా గజ్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఎంసీ రాజమౌళి... రాయపోల్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి గెలిస్తే దుబ్బాక మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. భాజపా, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప... మళ్లీ కనిపించరంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండిఃబిహార్ బరి: తొలి దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్