తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనర్లే మాక్ పోలింగ్​లో పాల్గొన్నారు. - మాక్ పోలింగ్

సిద్దిపేట జిల్లా హూస్నాబాద్​లోని మోడల్​ స్కూల్​లో మాక్​పోలింగ్ జరిగింది. ఓటింగ్​ ప్రాముఖ్యతను, ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలనే దానిపై అవగాహన పెంపొందించేందుకే విద్యార్థులకు ఈ పోలింగ్​ను నిర్వహించారు. ​ ​

మైనర్లే మాక్ పోలింగ్​లో పాల్గొన్నారు.

By

Published : Aug 27, 2019, 11:59 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​​లోని మోడల్ స్కూల్​లో నిర్వహించిన మాక్ పోలింగ్ అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో బాలుర తరుపున ఒకరిని బాలికల తరఫున ఒకరిని నాయకులుగా ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 19 మంది విద్యార్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఈ గుర్తులతో బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. సోమవారం ఉదయం నుంచి రహస్య ఓటింగ్ పద్ధతిలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులే ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 700 మందికి గాను 602 మంది విద్యార్థులు ఓటింగ్​లో పాల్గొని ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. ఎన్నికలపై అవగాహన ఏర్పడిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు.

మైనర్లే మాక్ పోలింగ్​లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details