సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో ఎంపీపీ కల్లూరి అనిత డంపింగ్ యార్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు చెత్తడబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఏకరూప దుస్తులను అందజేశారు.
'ఊరు పరిశుభ్రంగా ఉంటేనే.. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు'
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ సిద్దిపేట జిల్లా ఎల్కల్ గ్రామంలో ఎంపీపీ అనిత గ్రామస్థులకు చెత్తడబ్బాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని డంపింగ్‌యార్డును ప్రారంభించారు.
'గ్రామాన్ని స్వచ్ఛ, హరిత గ్రామంగా మార్చుకోవాలి'
గ్రామంలోని ప్రజలందరూ తడి, చెత్త పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ చెత్తను చెత్త డబ్బాలోనే వేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండేలా చూసుకోవాలని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి:'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'